jagan: ప్రాణాలు తీసుకోవద్దు.. పోరాడి సాధించుకుందాం: జగన్
- ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దు
- బతికుండి పోరాడుదామంటూ విన్నపం
- సుధాకర్ ఆత్మహత్యపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని వైసీపీ అధినేత జగన్ విన్నవించారు. తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలసి పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కోసం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన చేనేత కార్మికుడు సుధాకర్ (26) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని ఆయన అన్నారు. బతికుండి పోరాడి తమ హక్కులను సాధించుకుందామని చెప్పారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.