sayesha saigal: సాయేషా సైగల్ తో డ్యాన్స్ అంటే మాటలు కాదట!

  • అఖిల్'తో తెలుగు తెరకి పరిచయం 
  • పరాజయం కారణంగా పలకరించని ఛాన్సులు 
  • తమిళంలో దూసుకుపోతోన్న సాయేషా    

తెలుగు తెరకి 'అఖిల్' సినిమాతో సాయేషా సైగల్ పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నాజూకు సౌందర్యాన్ని చూసిన కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా పరాజయంపాలు కావడంతో, ఆమెను అవకాశాలు పలకరించలేదు. అయినా ఈ అమ్మాయి ఈ విషయాన్ని లైట్ తీసుకుని కోలీవుడ్ దిశగా అడుగులు వేసింది. ఈ సుందరికి అక్కడ బాగానే కలిసొచ్చింది. వరుసగా అగ్ర కథానాయకుల సరసన ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి.

సాధారణంగా కాస్త బొద్దుగా వుండే కథానాయికలను మాత్రమే ఇష్టపడే తమిళ తంబీలు .. ఈ నాజూకు భామను ఆరాధిస్తూ ఉండటం విశేషం. సాయేషా సైగల్ తో కలిసి నటించిన హీరోలు డ్యాన్స్ విషయంలో ఆమె స్పీడ్ ను తట్టుకోలేక ఇబ్బంది పడ్డారట. ఈ సుందరికి సంప్రదాయ నృత్యంలోనే కాదు మోడ్రన్ డ్యాన్స్ లోను మంచి ప్రవేశం వుంది. అందువలన డ్యాన్స్ ను అదరగొట్టేస్తోందట. ఈ విషయం ముందుగా అక్కడి హీరోలకి తెలిసినా, ఆమెకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తామే డ్యాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వినికిడి. 

More Telugu News