ap special status: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ యువకుడి ఆత్మహత్య!

  • మదనపల్లె యువకుడు సుధాకర్ బలవన్మరణం
  • హోదా ఆంధ్రుల హక్కని సూసైడ్ నోట్
  • గతంలోనూ హోదా ఉద్యమాల్లో పాల్గొన్న సుధాకర్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చిత్తూరుకు చెందిన యువకుడు సుధాకర్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి కలత చెందిన సుధాకర్ శనివారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకుముందు ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతికి చెందిన మును కోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

‘నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్ నోట్ రాసి, సుధాకర్ ప్రాణాలు తీసుకున్నాడు. మదనపల్లెలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సుధాకర్.. ప్రత్యేక హోదా కోసం జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. చనిపోయే ముందురోజు కూడా ఓ అనాథాశ్రమానికి రూ.5 వేలు విరాళం ఇచ్చాడు. ఆయన తల్లిదండ్రులు మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో సుధాకర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ap special status
Tirupati
SUICIDE
SUDHAKAR
MADANAPALLE

More Telugu News