Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు!: వైసీపీ నేత రమేష్ బాబు

  • పవన్ ది చంచల మనస్తత్వం 
  • జగన్ ను విమర్శించే స్థాయి లేదు
  • పవన్ కల్యాణ్ కు ఏం తెలుసు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ ది చంచలమైన మనస్తత్వమని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ బాబు విమర్శించారు. అవిశ్వాస తీర్మానం రోజున 150 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని చెప్పిన పవన్... ఆ తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడటమే మానేశారని దుయ్యబట్టారు.

జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కు లేదని అన్నారు. ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చిన పవన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. జగన్ వెంట అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఉన్నారని... చట్ట సభలపై జగన్ కు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పారు. పవన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Pawan Kalyan
Jagan
ch ramesh babu
kadapa
yrscp

More Telugu News