varun tej: హిట్ చిత్రాల దర్శకుడితో మెగా హీరో

  • వరుణ్ కి కథ వినిపించిన త్రినాథరావు 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్ 
  • నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్    
  'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' వంటి సినిమాలను రూపొందించిన నక్కిన త్రినాథరావు, ప్రస్తుతం రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆయన వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ఆయన వరుణ్ తేజ్ ను కలిసి ఒక కథను వినిపించడం .. కథ బాగుందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. ప్రస్తుతం వరుణ్ తేజ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన సంకల్ప్ రెడ్డి సినిమాను కూడా పూర్తిచేయనున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తిచేసిన తరువాతనే వరుణ్ తేజ్ .. నక్కిన త్రినాథరావుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.         
varun tej
nakkina trinatha rao

More Telugu News