India: ముస్లిం జనాభా పెరగడం వల్లే దేశంలో ఉగ్రవాదం, అత్యాచారాలు పెరిగాయి!: బీజేపీ ఎంపీ హరి ఓం పాండే ఆరోపణ

  • జనాభాను నియంత్రించకుంటే మరో పాకిస్తాన్ ఏర్పడుతుందని హెచ్చరిక
  • ఇందుకోసం కేంద్రం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని సూచన
  • స్వాతంత్ర్యం తర్వాత ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందని వ్యాఖ్య

భారత్ లో ముస్లింల జనాభా పెరుగుదల కారణంగానే దేశంలో ఉగ్రవాదం, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ హరి ఓం పాండే తెలిపారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి దేశంలో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతూనే ఉందన్నారు. దీనివల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలు దేశంలో తగ్గడంలేదని వ్యాఖ్యానించారు.


ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ముస్లింల జనాభాను ప్రభుత్వం నియంత్రించకుంటే త్వరలోనే భారత్ నుంచి మరో పాకిస్తాన్ ఏర్పడుతుందని హెచ్చరించారు. జనాభా పెరుగుదల వల్ల నిరుద్యోగం ఏర్పడి దేశ ఆర్థిక ప్రగతి మందగిస్తుందని పాండే పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అప్పుడే మరోసారి దేశ విభజన జరగకుండా ఆపగలమని అభిప్రాయపడ్డారు.

More Telugu News