Sakshyam: 'సాక్ష్యం'కు ఎదురు దెబ్బ... పడని మార్నింగ్ షో!

  • నిర్మాత, ఫైనాన్షియర్ మధ్య విభేదాలు
  • తెల్లవారుజాము షో, మార్నింగ్ షోలు రద్దు
  • సాంకేతిక సమస్యలే కారణమంటున్న చిత్ర యూనిట్
బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన హై బడ్జెట్ మూవీ 'సాక్ష్యం'కు ఎదురుదెబ్బ తగిలింది. నేడు విడుదల కావాల్సిన చిత్రం తెల్లవారుజాము షో, మార్నింగ్ లు పడలేదు. సాంకేతిక సమస్యల కారణంగా షోలు పడలేదని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతుండగా, నిర్మాత అభిషేక్ నామా, చిత్రానికి ఫైనాన్స్ చేసిన వారి మధ్య తలెత్తిన వివాదమే కారణమని తెలుస్తోంది. సినిమా విడుదలను నిలిపివేయాలని అభిషేక్ నామాకు లీగల్ నోటీసులు కూడా అందాయని సమాచారం.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా సినిమా విడుదల కాకపోగా, ముందే టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని థియేటర్లకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో ఉదయం 8.45 గంటలకు పడాల్సిన షో రద్దయింది. సమస్యలను పరిష్కరించుకుని కనీసం మ్యాట్నీ షో అయినా వేయాలని ప్రొడ్యూసర్స్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఏ థియేటర్ కూ డిజిటల్ ప్రింట్ అందలేదని తెలుస్తుండగా, కనీసం మ్యాట్నీ అయినా పడుతుందో లేదోనని బెల్లంకొండ అభిమానులు ఆందోళనతో ఉన్నారు.
Sakshyam
Sai Srinivas
Morning Show
Cancel

More Telugu News