Jana Sena: నేటి సాయంత్రం 4 గంటలకు భీమవరంలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ!

  • వన్ టౌన్ పోలీస్ బొమ్మ దగ్గర ఏర్పాటు 
  • రెండు నియోజకవర్గాల జన సైనికుల కోరిక మేరకు సభ 
  • ఓ ప్రకటనలో వెల్లడించిన జనసేన
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను చేస్తున్న 'జనసేన పోరాట యాత్ర'లో భాగంగా నేటి సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. వన్ టౌన్, పీపీ రోడ్ లో ఉన్న పోలీస్ బొమ్మ దగ్గర ఈ సభను ఏర్పాటు చేశామని, భీమవరం, ఉండి నియోజకవర్గాల జన సైనికుల కోరిక మేరకు, రెండు నియోజవర్గాల పోరాట యాత్రకు భీమవరం పట్టణాన్నే కేంద్రంగా చేశామని ఆ పార్టీ పేర్కొంది.

ఈ రెండు నియోజక వర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. కాగా, ఇప్పటికే ఈ ప్రాంత జన సైనికులతో పవన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దిగ్విజయంగా పోరాట యాత్రను పూర్తి చేసుకుని, అక్కడి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సభను నిర్వహించిన ఆయన, ఉభయ గోదావరి జిల్లాల్లో పోరాట యాత్రను భీమవరం పట్టణం నుంచి మొదలుపెట్టిన సంగతి విదితమే. గత మూడు రోజులుగా ఆయన ఈ ప్రాంతంలోనే ఉన్నారు.
Jana Sena
Pawan Kalyan
Bhimavaram

More Telugu News