chittoor: ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలకే భూమి కేటాయించాలి: ఏపీ మంత్రి అమరనాథరెడ్డి

  • చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పురోగతిపై మంత్రి సమీక్ష
  • చిన్నపాండూరులో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి
  • ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉందన్న మంత్రి

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక పురోగతిపై పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి అమరావతిలో వీడియో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి భాగస్వామ్య సదస్సులు, ఇతర వేదికలపై చేసుకున్న ఎంఓయులకు భూ కేటాయింపుల గురించి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను అడిగి తెలుసుకున్నారు.

చిన్నపాండూరులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎక్కవమంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉందని, ఎవరైతే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారో వారికే భూమి కేటాయించాలని అమరనాథరెడ్డి ఆదేశించారు. భూమి ధర అధికంగా నిర్ణయించిన చోట్ల వీలైనంత వరకు వాటి ధరలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎంఎస్ఎంఇ పార్కులకు సంబంధించి పరిపాలన అనుమతి ఉత్తర్వులను సత్వరమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.  

More Telugu News