Andhra Pradesh: ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మపై చీటింగ్ కేసు నమోదు

  • రెండేళ్ల క్రితం ఓ డైరీ ఫాంలో పని చేసిన మహిళ మరీంభి
  • ఆమె కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు
  • నష్టపరిహారం ఇప్పించేందుకు మధ్యవర్తిగా ఉన్న పద్మశ్రీ

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మపై చీటింగ్ కేసు నమోదైంది. ప్రమాదవశాత్తు తమ కుమారుడు చెరువులో పడి మరణించగా ఇచ్చిన పరిహారాన్ని పద్మశ్రీ తమకు ఇవ్వడం లేదని మరీంభి అనే మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా మరీంభి మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ఓ డైరీ ఫాంలో తాను పని చేస్తుండగా తమ కుమారుడు పఠాన్ సాయికుమార్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడని చెప్పింది. డైరీ ఫాం యాజమాన్యానికి, తనకు మధ్యవర్తిగా సుంకర పద్మశీ వ్యవహరించారని.. నష్టపరిహారం కింద ఇచ్చిన లక్ష రూపాయలను ఆమె తన వద్దే ఉంచుకున్నారని, తనకు ఇవ్వడం లేదని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. రెండేళ్లుగా ఆమె తన ఇంటిచుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప, ఆ డబ్బు మాత్రం ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. 

More Telugu News