Hyderabad: ఫీజు కట్టలేదని విద్యార్థిని వెనక్కి పంపిన యాజమాన్యం.. అవమానభారంతో ఆత్మహత్య!

  • ముషీరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సంఘటన
  • ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మహేశ్ ఆత్మహత్య
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు

ఓ విద్యార్థి పాఠశాల ఫీజు కట్టలేదని చెప్పి యాజమాన్యం అతన్ని తిరిగి ఇంటికి పంపించి వేయడంతో అవమానభారానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఉన్న లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈరోజు జరిగింది.

మహేశ్ అనే విద్యార్థి ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లిన మహేశ్ ను ఫీజు చెల్లించలేదంటూ యాజమాన్యం వెనక్కి పంపివేసింది. తమ ఇంటికి వెళ్లిన విద్యార్థి మహేశ్ అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒక్కడే ఉన్న మహేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని సమాచారం. ఈ మేరకు మహేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.

 కాగా, పాఠశాల యాజమాన్యం వేధింపుల కారణంగానే విద్యార్థి చనిపోయాడనే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ కార్యకర్తలు ఆ పాఠశాలపై దాడి చేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా, మహేశ్ రెండ్రోజులుగా పాఠశాలకు రావడం లేదని  స్కూల్ యాజమాన్యం అంటోంది. తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.    

More Telugu News