loksabha: కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి: టీడీపీ ఎంపీ తోట నర్సింహం

  • ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ గంగలో కలిపారు
  • కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
  • మోదీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి

ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలని టీడీపీ లోక్ సభా పక్ష నేత తోట నర్సింహం అన్నారు. లోక్ సభలో జీరో అవర్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఈ సందర్భంగా తోట నర్సింహం తెలుగులో మాట్లాడారు.

ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ గంగలో కలిపారని, అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఇటీవల జరిగిన చర్చలో మోదీ ఇచ్చిన సమాధానం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడ్డారు. లోక్ సభలో మోదీ ప్రసంగం రాజకీయ ఉపన్యాసాన్ని తలపించిందని అన్నారు. విభజన సమయంలో నాడు మోదీ సహచరులతో మాట్లాడిన తర్వాతే ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇచ్చామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని తోట ప్రస్తావించారు. ఏపీ పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News