jenasena: వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది: జగన్ కు ‘జనసేన’ నేత హెచ్చరిక

  • జగన్ లా మా నేత పవన్ కల్యాణ్ పై అవినీతి ఆరోపణలు లేవు
  • పవన్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు
  • ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారు
పవన్ కల్యాణ్ పై నిన్న జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ‘జనసేన’ నేత మండిపడుతున్నారు. విజయవాడలో ‘జనసేన’ నేత మండలి రాజేశ్ మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ లా తమ నేత పవన్ కల్యాణ్ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తే తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ కు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, ప్రతిపక్ష నేతగా ఆయన విఫలమయ్యారని విమర్శించారు.
jenasena
Jagan

More Telugu News