durisetty anudeep: సివిల్స్ టాపర్ అనుదీప్ కు రాష్ట్రపతి ఆహ్వానం!

  • ఆగస్ట్ 15న రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం
  • దురిశెట్టి అనుదీప్ కు ఆహ్వానం
  • ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
సివిల్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రపతి కార్యాలయం లేఖను పంపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆహ్వానం మేరకు ఈ లేఖను పంపారు.

రాష్ట్రపతి భవన్ లో గల కల్చరల్ సెంటర్ కార్యాలయంలో కోవింద్ తో ఎట్ హోమ్ లో పాల్గొనాలని లేఖలో పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇన్విటేషన్ కార్డుతో పాటు, గుర్తింపు కార్డును కూడా తీసుకొని రావాలని సూచించారు. తమ కుమారుడికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడం పట్ల ఆయన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
durisetty anudeep
civils
topper
President Of India
at home
invitation

More Telugu News