vijay devarakonda: విజయ్ దేవరకొండ ఓ పాట కూడా పాడేశాడండోయ్!

  • ఆసక్తిని పెంచేసిన టీజర్ 
  • రేపు సెకండ్ సింగిల్ రిలీజ్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల  

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' సినిమా రూపొందింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రష్మిక మందన కథానాయికగా నటించింది. గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మిస్తోన్న ఈ సినిమా .. పోస్టర్స్ తోనే యూత్ లో ఆసక్తిని పెంచేసింది. రీసెంట్ గా వదిలిన టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. అటు లవర్ గాను .. ఇటు భార్యగాను కనిపించి ఈ టీజర్లో రష్మిక మందన ఆకట్టుకుంది. సినిమాలో రొమాన్స్ పాళ్లు ఎక్కువేననే సంకేతాలను ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకి ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ విజయ్ దేవరకొండ పాడినది కావడం విశేషం. ఈ సాంగ్ తరువాత ఈ సినిమాపై ఇంకెంతగా క్రేజ్ పెరుగుతుందో చూడాలి. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News