పాకిస్థాన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్
- లాహోర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న సయీద్
- ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపు
- అల్లాహో అక్బర్ తెహ్రీక్ తరపున పోటీ చేస్తున్న సయీద్ అనుచరులు
హఫీజ్ సయీద్ కు చెందిన పార్టీ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ఈ పార్టీకి పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ గుర్తింపును ఇవ్వడానికి నిరాకరించడంతో... ఈ పార్టీ అభ్యర్థులు అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.