BCCI: క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ!

  • ఓటమికి భార్యలే కారణమంటూ విమర్శలు
  • భార్యలు, ప్రియురాళ్లను పక్కనబెట్టండి
  • ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశం

 ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లకు పెను షాకిచ్చింది బీసీసీఐ. ఈ పర్యటనలో క్రికెటర్లు తమ భార్యలు లేదా ప్రియురాళ్లకు కనీసం నెల రోజుల పాటు దూరంగా ఉండాలని షరతు విధించింది. మైదానంలో ఆటగాళ్లు వైఫల్యం చెందడానికి చాలా సందర్భాల్లో వారి కుటుంబీకులే కారణమని విమర్శలు వస్తున్నాయి. టూర్లలో ఎంజాయ్ చేసి వచ్చి బ్యాటు పట్టుకుంటున్నారని, సరైన ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ లు ఆడి ఓడిపోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి వన్డే సిరీస్ ఓటమి తరువాత క్రికెటర్లు తమ భార్యా పిల్లలతో కలసి టూర్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంటే ట్రోలింగ్ కూడా జరిగింది. ఓటమి తరువాత వీళ్లు ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. ఇక టెస్టు సిరీస్ లోనూ భారత్ ఓటమి పాలైతే విమర్శల తీవ్రత మరింతగా పెరుగుతుందన్న ఆందోళనలో ఉన్న బీసీసీఐ, ముందుజాగ్రత్తగా టెస్టు మ్యాచ్ ల వరకూ జీవిత భాగస్వాములను దూరం పెట్టాలని ఆదేశించింది.

More Telugu News