kvp: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మరోసారి వంచించింది: కేవీపీ రామచంద్రరావు

  • కేంద్రం సమాధానం చెప్పలేకపోయింది
  • రాజ్యసభ నుంచి పారిపోయింది
  • దీని ఫలితాన్ని 2019లో బీజేపీ అనుభవిస్తుంది

విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయిన కేంద్రం.. రాజ్యసభ నుంచి పారిపోయిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మరోసారి వంచించిందని, దీని ఫలితాన్ని 2019లో బీజేపీ అనుభవించనుందని అన్నారు. 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఈ ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులు సరిపోవని, ఏపీకి ఇచ్చిన హామీలను ఎగవేసేందుకే ‘నీతి ఆయోగ్’ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, ‘కేంద్రం’తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News