nara rohith: 'వీర భోగ వసంత రాయలు' నుంచి నారా రోహిత్ లుక్

  • నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ
  • వైవిధ్యభరితమైన కథాకథనాలు   
  • ప్రతి పాత్రకు కొత్త లుక్
ఇంద్రసేన దర్శకత్వంలో .. వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'వీర భోగ వసంత రాయలు' సినిమా రూపొందుతోంది. నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి శ్రియ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నారా రోహిత్ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక చెయ్యికి కట్టుతో .. సీరియస్ లుక్ తో నారా రోహిత్ కనిపిస్తున్నాడు.

 ఒక చెయ్యి పనిచేయని వ్యక్తిగానే ఆయన కనిపిస్తాడని అంటున్నారు. ఇక శ్రీవిష్ణు విషయానికొస్తే ఆయన గుండుతో కనిపించనున్నట్టు చెబుతున్నారు. సుధీర్ బాబు పాత్రకి సంబంధించిన విషయాలు బయటికి రావలసి వుంది. ఇలా ప్రధాన పాత్రధారులంతా కూడా విభిన్నమైన లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. ఒక వైపున సోలో హీరోలుగా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు, ఈ సినిమాలో కలిసి నటిస్తుండటం విశేషం. నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.      
nara rohith
sudheer babu
sri vishnu
shriya

More Telugu News