Revanth Reddy: కేటీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి!

  • పొలిటికల్ ఫిట్ నెస్ లో నాతో పోటీపడేవారు లేరు
  • కేటీఆర్ వి ఫిట్ నెస్ లేని ఆటలే
  • నాతో పాటు 10కే రన్ కు వచ్చి, ఫిట్ నెస్ నిరూపించుకోవాలి
తెలంగాణలోని రాజకీయ నేతల్లో అందరికన్నా తానే ఎక్కువ ఫిట్ గా ఉన్నానని... పొలిటికల్ ఫిట్ నెస్ లో తనతో పోటీపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లోకే కాకుండా ఏ ఆటలోనైనా తనతో పోటీపడేంత ఫిట్ నెస్ మంత్రి కేటీఆర్ కు లేదని అన్నారు.

 కేటీఆర్ వి అన్నీ ఫిట్ నెస్ లేని ఆటలేనని ఎద్దేవా చేశారు. చేతనైతే కేటీఆర్ తనతోపాటు 10కే రన్ పోటీకి రావాలని, ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. గతంలో తెలంగాణ ఉద్యమం ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేటీఆర్... ఇప్పుడు అధికారం ముసుగులో జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 
Revanth Reddy
KTR
fitness challenge

More Telugu News