roja: త్వరలోనే 'వైయస్సార్ అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేస్తా: రోజా

  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు
  • అందుకే సొంతంగా నేనే సహాయ కార్యక్రమాలను చేపడుతున్నా
  • వైసీపీ అధికారంలోకి వస్తే నగరి రూపురేఖలే మారిపోతాయి
వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే 'వైయస్సార్ అన్న' పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే, ప్రజల కోసం తానే సొంతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని చెప్పారు. 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందించానని... నగరి ప్రభుత్వాసుపత్రి, హాస్టళ్లు, బాలికల జూనియర్ కాలేజీల్లో ఆర్వో ప్లాంట్లు, కూలర్లను ఏర్పాటు చేశానని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు.
roja
ysr canteen
nagari

More Telugu News