చంద్రబాబు ప్రోత్సాహంతో ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారు: అనిల్ కుంబ్లే ప్రశంసలు
- మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అథ్లెటిక్ స్టేడియంలకు శంకుస్థాపన
- సీకే నాయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమన్న కుంబ్లే
- తొలి కెప్టెన్ గా భారత్ క్రికెట్ కు మార్గనిర్దేశం చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహంతో, ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆటలు ఆడేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఔత్సాహికులకు మంచి ట్రైనింగ్ కూడా కల్పిస్తున్నారని, వారిని భవిష్యత్ ఒలింపియన్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కుంబ్లేను మంత్రి కొల్లు రవీంద్ర సన్మానించారు.