rahul vijay: ప్రేమకథాంశంగా 'ఈ మాయ పేరేమిటో' .. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్

  • ప్రేమకథాంశంగా 'ఈ మాయ పేరేమిటో'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

ఈ మధ్య కాలంలో తెలుగు తెరను పలకరిస్తోన్న చిన్న సినిమాల సంఖ్య ఎక్కువైపోయింది. వాటిలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలే కనిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో రూపొందినా, కంటెంట్ తో పడగొడుతూ కాసుల వర్షం కురిపించిన సినిమాలు కూడా ఈ మధ్య వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 'ఈ మాయ పేరేమిటో' టైటిల్ తో మరో ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, ఈ నెల 28వ తేదీన ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆడియోను విడుదల చేస్తుండటం విశేషం. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రాహుల్ విజయ్ .. కావ్య థాపర్ జంటగా నటిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో యూత్ ను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News