gorati venkanna: ఆ పాట వెనకాల నిజ జీవితాలు వున్నాయి: గోరటి వెంకన్న

  • 1996లో 'పల్లే కన్నీరు పెడుతుందో' రాశాను 
  • ఊరికి దూరమైన బాధలో రాశాను 
  • ఊళ్లోని పరిస్థితుల గురించి ప్రస్తావించాను    

పల్లె బాటలో నడుస్తుంటే కలిగే ఆనందం వేరు .. అరుగులపై కూర్చున్న వాళ్లు ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటే కలిగే సంతోషం వేరు. పల్లె గాలి స్పర్శతో పదాలు పాడే గాయకులైన వాళ్లలో గోరటి వెంకన్న ఒకరుగా కనిపిస్తారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంలోనే 'పల్లే కన్నీరు పెడుతోంది .. 'అనే పాట ఎందుకు రాయవలసి వచ్చింది?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. " పల్లే కన్నీరు పెడుతుందో .. " అనే పాటను నేను 1996లో రాశాను. ఉద్యోగ రీత్యా నాకు బదిలీ కావడం వలన ఊరికి దూరమయ్యాను. హైదరాబాద్ లో వుండవలసి వచ్చింది .. 'మన ఊరు ఎంతో బాగుండే గదా' అనిపించింది. వలసల కారణంగా ఊళ్లలోని పరిస్థితులు మారిపోయాయి. అదే ఆ పాట రాయడానికి కారణమైంది. 'పల్లే కన్నీరు పెడుతుందో .. ' ఒక పాటగా వినిపిస్తున్నప్పటికీ, ప్రతి మాటలో .. ప్రతి పాదంలో నిజ జీవితాలు వున్నాయి. ఈ పాటలో .. మా ఊరు .. అక్కడి పరిస్థితులు .. మా ఊళ్లోని మనుషులు కనిపిస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News