uddav thakarey: టీడీపీలాంటి మిత్రులు కూడా అవిశ్వాసం పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి!: ఉద్ధవ్ థాకరే

  • మిత్రులు కూడా అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో మోదీ, అమిత్ షా చెప్పాలి
  • మిత్రపక్షం అవిశ్వాసం పెట్టడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమం
  • తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోబోము
బీజేపీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిత్రపక్షమైన టీడీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో ఆధునిక చాణక్యులు చెప్పాలంటూ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఉద్దేశించి అన్నారు. అవిశ్వాసం పెట్టిన టీడీపీ ఎవరు? బీజేపీ మిత్రపక్షం అని అన్నారు. మిత్రులు కూడా మీపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఓ మిత్రపక్షం అవిశ్వాసం ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమం అని ఎద్దేవా చేశారు.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరు కావడంపై స్పందిస్తూ... తాము ఎవరిపై విశ్వాసం చూపాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నదేముందని అన్నారు. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయా? అని ప్రశ్నించారు.   
uddav thakarey
modi
amit shah
Telugudesam
no confidence motion

More Telugu News