gorati venkanna: మాది చాలా కుగ్రామం .. అక్కడ సినిమా టాకీస్ కూడా లేదు: గోరటి వెంకన్న

  • సినిమా పాటలంటే ఇష్టమే 
  • పాత పాటలు పాడతాను 
  • పాటల్లో మార్పులు గమనిస్తూ వచ్చాను

పల్లె పదాలతో .. పల్లె పాటలతో తెలుగు జానపద సాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయితగా .. గాయకుడిగా గోరటి వెంకన్న కనిపిస్తారు. ఆయన పాటల్లో నీతి .. సందేశం .. స్ఫూర్తి .. చైతన్యం ఉంటాయి. అవి వాడుక భాషలో జాలువారి అందరినీ ఆలోచింపజేస్తాయి. కవిగా .. గాయకుడిగా కనిపించే గోరటి వెంకన్న తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన గురించిన విషయాలను చెప్పుకొచ్చారు.

 "సినిమా పాటలంటే నాకు ఇష్టమే .. వాటి పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు. పాత పాటలను బాగా ఇష్టపడతాను .. పాడతాను. కాకపోతే మొదటి నుంచి నా ప్రపంచం వేరు .. మాది చాలా కుగ్రామం .. సినిమా టాకీస్ ఉండేది కాదు. ఒక్క ఇంటిలో మాత్రమే పెద్ద రేడియో ఉండేది .. అందరం అందులోనే పాటలను వినేవాళ్లం. బాగా ఊహ తెలిసిన తరువాత సినిమా పాటల్లో వస్తోన్న మార్పులను గమనించాను. సినిమా పాటైనా .. జానపదమైనా అనుభవించి రాయడంలోనే ఆనందం వుంది .. అనుభూతి వుంది" అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News