vijay devarakonda: యూత్ ను ఆకట్టుకునే 'గీత గోవిందం' టీజర్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'గీత గోవిందం'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన
  • ఈ నెల 29వ తేదీన ఆడియో వేడుక
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో విజయ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' చిత్రం రూపొందుతోంది. బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ కి నచ్చే ప్రేమకథాంశంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

 రైతు వేషధారణలో ట్రాక్టర్ నడుపుతూ విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఆ సమయంలో రేడియోలో వస్తోన్న 'ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది .. ' సాంగ్ లో తననీ .. భార్యని ఊహించుకుంటాడు. అందుకు సంబంధించిన రొమాంటిక్ సీన్స్ ను బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం బాగుంది. 'ఇంకోసారి అమ్మాయిలూ .. ఆంటీలు .. ఫిగర్లు అంటూ తిరిగావంటే .. యాసిడ్ పోసేస్తాను' అంటూ హీరోయిన్ .. హీరోకు వార్నింగ్ ఇచ్చిన తీరు ఆకట్టుకునేలా వుంది. లవ్ .. రొమాన్స్ .. కామెడీతో కూడిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. 
vijay devarakonda
rashmika mandana

More Telugu News