Rajya Sabha: రాజ్యసభలో అవిశ్వాసంపై చర్చను వాయిదా వేసిన వెంకయ్యనాయుడు

  • స్వల్పకాలిక చర్చకు నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ
  • చర్చను రేపటికి వాయిదా వేసిన రాజ్యసభ ఛైర్మన్
  • సభ్యుల అభ్యర్థన మేరకే వాయిదా అన్న వెంకయ్య
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీలు నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ్య ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని తెలిపారు.

అయితే, చర్చను మాత్రం రేపు చేపడదామని చెప్పారు. సభ్యుల అభ్యర్థన మేరకే చర్చను వాయిదా వేశామని తెలిపారు. మరోవైపు పార్లమెంటు ప్రాంగణం వద్ద టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Rajya Sabha
venkaiah naidu
Telugudesam
YSRCP

More Telugu News