samanth: సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్ విడుదల!

  • నేను నమ్మిన సినిమా ఇది
  • సెప్టెంబరు 13న ఈ సినిమా చూడండి
  • ఓ ట్వీట్ చేసిన నటి సమంత

దక్షిణాది నటి సమంత నటిస్తున్న ‘యూటర్న్’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా సమంత ఓ ట్వీట్ చేసింది. ‘నేను నమ్మిన సినిమా ఇది. సెప్టెంబరు 13న ఈ సినిమా చూసి, మీరు కూడా ఇలానే అభిప్రాయపడతారని ఆశిస్తున్నా’ అని సమంత పేర్కొంది.  

కాగా, పవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బందరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘యూటర్న్’లో ఆది పినిశెట్టి, రాహుల్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను సమంత పూర్తి చేసింది. ‘రంగస్థలం’ తర్వాత సమంత నటించిన చిత్రం ఇది. 

More Telugu News