richa chadda: నా జీవితంలో జరిగినవన్నీ చెప్పేశాను.. ఏదీ దాచుకోలేదు: షకీలా

  • షకీలా జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న బయోపిక్
  • ప్రధాన పాత్రను పోషిస్తున్న రిచా చద్దా
  • రిచా తనలాగానే ధైర్యవంతురాలు అన్న షకీలా

సినీ నటి షకీలా జీవిత చరిత్రతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు లంకేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తోంది. ఈ నేపథ్యంలో, షకీలాను రిచా కలుసుకుంది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ, రిచా కూడా తనలాగే ధైర్యంగా ఉంటుందని చెప్పింది. స్క్రిప్ట్ ను పూర్తిగా అర్థం చేసుకోగల నటి అని కితాబిచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తాను ఏదీ దాచలేదని... తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పానని... నిజాలు దాచి, సినిమా తీస్తే బయోపిక్ కు అర్థం లేదని చెప్పింది. 

More Telugu News