Rahul Gandhi: భారత పరువుతీసిన రాహుల్ గాంధీ: జైట్లీ నిప్పులు

  • రఫాలే డీల్ విషయంలో రక్షణ మంత్రి అబద్ధాలు చెప్పారన్న రాహుల్
  • ఫేస్ బుక్ లో స్పందించిన అరుణ్ జైట్లీ
  • దేశాధినేతతో మాట్లాడిన మాటలపైనే అబద్ధాలా?
  • మండిపడిన జైట్లీ

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తో జరగని సంభాషణను జరిగినట్లు ప్రస్తావించడం ద్వారా, భారత పరువును తీశారని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. రఫాలే ఫైటర్ జెట్ డీల్ విషయంలో దేశానికి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెప్పారని, అసలు విషయం తాను మెక్రాన్ తో మాట్లాడిన వేళ, రెండు దేశాల మధ్య రక్షణ కొనుగోళ్లకు సంబంధించి వివరాలు రహస్యంగా ఉంచాలన్న ఒప్పందమేదీ కుదరలేదని ఆయన అన్నట్లు రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

 కాగా, రాహుల్ ప్రసంగం తరువాత గోప్యత ఒప్పందం భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉందని చెబుతూ ఫ్రెంచ్ సర్కారు ఒక ప్రకటన జారీ చేసింది. దీనిపై జైట్లీ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. రాహుల్‌ అబద్ధాలు చెప్పడం ద్వారా లోక్ సభను చులకన చేశారని జైట్లీ ఆరోపించారు. ఒక దేశాధినేతతో మాట్లాడిన మాటల గురించి అవాస్తవాలను చెప్పడం ఎంతమేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

More Telugu News