ISRO: ఇస్రో చైర్మన్ రేసులో ఉన్న మిశ్రాపై బదిలీ వేటు!

  • అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు బదిలీ
  • శివన్ పై విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కిన మిశ్రా
  • ఇస్రో సలహాదారుగా బాధ్యతలు

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) తదుపరి చైర్మన్ రేసులో ఉన్న సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ గా ఉన్న మిశ్రాను బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.

ఇటీవలి కాలంలో ఇస్రో చైర్మన్ శివన్, ప్రైవేటు సంస్థలు చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించి మిశ్రా వార్తల్లోకి ఎక్కారు. శివన్ పై చేసిన విమర్శల కారణంగానే మిశ్రాపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. భారత్ ప్రయోగించిన పలు ముఖ్య ఉపగ్రహాల తయారీలో మిశ్రా పాలుపంచుకున్నారు. ఆయనకు ఇస్రో సలహాదారుగా కొత్త బాధ్యతలు అప్పగించారు. మిశ్రా స్థానంలో ఎస్ఏసీ డైరెక్టర్ గా డీకే దాస్ ను నియమించినట్టు ఇస్రో అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News