Andhra Pradesh: రైతు పొలంలో 30 బంగారు నాణేలు.. శ్రీ వేంకటపతి దేవరాయల కాలం నాటివిగా గుర్తింపు!

  • కాలువ తవ్వుతుండగా బయటపడిన రాగి చెంబు
  • 17వ శతాబ్దానికి చెందిన 30 బంగారు నాణేలు
  • స్వాధీనం చేసుకున్న అధికారులు
శ్రీ కృష్ణదేవరాయుల తర్వాతి వంశస్తుడైన మూడవ శ్రీ వేంకటపతిదేవరాయల కాలం నాటివిగా చెబుతున్న 30 బంగారు నాణేలు ఓ రైతు పొలంలో లభించాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన రైతు పైపుల కోసం కాలువ తవ్వుతుండగా చిన్న రాగిపాత్ర బయటపడింది. అందులో బంగారు నాణేలు ఉన్నట్టు గుర్తించారు.

బంగారు నాణేలపై సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు రైతు నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షించి చూడగా శ్రీ కృష్ణదేవరాయలు తర్వాతి వంశస్థుడైన మూడవ శ్రీ వేంకటపతిదేవరాయలు కాలం నాటివిగా తేలినట్టు అధికారులు తెలిపారు. ఒక్కో నాణెం బరువు3.40 గ్రాములు ఉందని పేర్కొన్నారు. 1633-1646 మధ్య కాలంలో ఈ నాణేలు చెల్లుబాటులో ఉండేవని తెలిపారు.
Andhra Pradesh
Prakasam District
Sri krishna Devaraya

More Telugu News