surya: సూర్య మూవీ నుంచి తప్పుకోవడంపై శిరీష్

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • ముందుగా ఓకే చెప్పిన అల్లు శిరీష్ 
  • ఆయన స్థానంలో వచ్చిన ఆర్య    

సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ .. బొమన్ ఇరాని .. అల్లు శిరీశ్ లను ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో తన పాత్రకి గల ప్రాధాన్యతను గురించి తెలుసుకునే అల్లు శిరీష్ ఒప్పుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి అల్లు శిరీష్ ను తప్పించి ఆర్యను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రచారం అల్లు శిరీష్ చెవి వరకూ చేరిందేమో .. ఆయన ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం తాను చేస్తోన్న 'ఏబీసీడీ' సినిమా వలన, సూర్య సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాననీ .. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని చెప్పాడు. దర్శక నిర్మాతలు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారనీ .. సూర్యతో కలిసి నటించే అవకాశం మరోసారి దక్కాలని కోరుకుంటున్నానని అన్నాడు.

More Telugu News