Jagan: నేషనల్ మీడియా దగ్గరికి మీరెందుకు? ఈ పని చేస్తే వాళ్లే మీ దగ్గరకు వస్తారు: చంద్రబాబుకు జగన్ సలహా

  • అవిశ్వాసంపై చర్చలో ఎవరూ ఏపీ గురించి మాట్లాడలేదు
  • ఎంపీలతో నిరాహార దీక్ష చేయిస్తే జాతీయ మీడియా వస్తుంది
  • చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్న జగన్
నేడు ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పి, నేషనల్ మీడియాతో మాట్లాడి వస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చ సమయంలో ఏ పార్టీ వాళ్లు వాళ్లకు సంబంధించిన ప్రసంగాలు చేశారే తప్ప, ఎవ్వరూ ఏపీకి జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించలేదని వ్యాఖ్యానించిన జగన్, చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వెళుతున్నారో ఆయనకే తెలియదని విమర్శలు గుప్పించారు.

తన మాట విని టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తే, వారితో పాటు అందరమూ నిరాహార దీక్షకు కూర్చుందామని, అప్పుడు నేషనల్ మీడియా దగ్గరికి చంద్రబాబు వెళ్లక్కర్లేదని, వారే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. 
Jagan
Chandrababu
No Confidence Motion
National Media

More Telugu News