Whatsapp: వాట్స్ యాప్ యూజర్లకు షాక్... ఏదైనా ఫార్వార్డ్ చేయాలనుకుంటే ఐదుగురికి మాత్రమే!

  • వాట్స్ యాప్ ద్వారా వైరల్ అవుతున్న వదంతులు
  • వాటిని నమ్మి అమాయకులను కొట్టి చంపుతున్న ప్రజలు
  • ఫార్వార్డ్ ఐకాన్ బటన్ ను తొలగిస్తామని ఈసీకి తెలిపిన సంస్థ
సోషల్ మీడియా ద్వారా, అందునా వాట్స్ యాప్ ద్వారా వైరల్ అవుతున్న తప్పుడు వదంతులతో ప్రజలు ఆందోళనకు గురై అమాయకులను కొట్టి చంపుతున్న ఘటనలు పెచ్చుమీరడంతో వాట్స్ యాప్ చర్యలు ప్రారంభించింది. వదంతుల వ్యాప్తిపై ప్రభుత్వం నుంచి కఠిన హెచ్చరికలు రావడంతో ఫార్వార్డ్ ఐకాన్ బటన్ ను తొలగించనున్నట్టు సంస్థ పేర్కొంది.

ఇకపై ఒకేసారి ఐదుగురికి మాత్రమే ఏదైనా సందేశాన్ని ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని, ఈ మేరకు నియంత్రణా చర్యలు చేపట్టామని పేర్కొంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ యాప్ ద్వారా వదంతులు వ్యాప్తి చెందకుండా చూస్తామని, యాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈసీకి వాట్స్ యాప్ తెలియజేసింది.
Whatsapp
Forword Icon Button
Fake News

More Telugu News