varla ramaiah: దొంగల నాయకుడు జగన్..చిల్లర నాయకుడు పవన్: వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు
- జగన్, పవన్ కల్యాణ్ లపై మండిపడ్డ టీడీపీ నేత వర్ల
- వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
- సీఎం పదవి మాత్రం వీళ్లకు కావాలి
వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘దొంగల నాయకుడు జగన్.. చిల్లర నాయకుడు పవన్ లకు సీఎం పదవే కావాలి’ అని విరుచుకుపడ్డారు.
వీళ్లిద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్న జగన్ ఎక్కడ పడుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ, కేసుల మాఫీ కోసమే బీజేపీతో వైసీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని, మోదీకి, జగన్ కు విజయసాయిరెడ్డి బ్రోకర్ లా పనిచేస్తున్నారని ఆరోపించారు.