rajnath singh: రాజ్ నాథ్ జీ! కథలు, చరిత్రలు కాదు, మీ పాలనలో ఏం చేశారో చెప్పండి?: మల్లికార్జున ఖర్గే

  • సమస్యలపై ప్రశ్నిస్తుంటే చరిత్ర పాఠాలు చెబుతారా?
  • మీ మాటలెప్పుడూ రాముడు,కృష్ణుడు చుట్టూతానే  
  • మీకు శంభుకుడు, ఏకలవ్యుడు గుర్తుకురారు

బీజేపీపైన, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పైన కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ, సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే రాజ్ నాథ్ సింగ్ చరిత్ర పాఠాలు చెబుతున్నారని విమర్శించారు.

‘రాజ్ నాథ్ జీ.. కథలు, చరిత్రలు కాదు మీ పాలనలో ఏం చేశారో చెప్పండి?’ అని ప్రశ్నించారు. మహాభారతం, రామాయణాల గురించి మాట్లాడే వీరికి, శంభుకుడు, ఏకలవ్యుడు గుర్తుకురారని, వీళ్ల మాటలెప్పుడూ రాముడు, శ్రీకృష్ణుడు చుట్టే తిరుగుతాయని  విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏ భావజాలాన్ని విశ్వసిస్తాయో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి గొప్పగా చెబుతారని, ఆర్ఎస్ఎస్ భావజాలం అంబేడ్కర్ సిద్ధాంతానికి విరుద్ధమని అన్నారు. 

More Telugu News