Rahul Gandhi: లోక్ సభలో సహచరుల వైపు చూసి కన్నుగీటిన రాహుల్ గాంధీ.. వీడియో చూడండి

  • లోక్ సభలో ఆకట్టుకున్న పలు ఘటనలు
  • మోదీని హత్తుకున్న రాహుల్
  • అనంతరం కాంగ్రెస్ నేతలవైపు చూస్తూ కన్నుగీటిన వైనం
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ప్రసంగం ముగించే ముందు... మీ మనసుల్లో ద్వేషం ఉంటుంది కానీ, మా మనసుల్లో ద్వేషం ఉండదని చెప్పారు. వెంటనే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి హత్తుకున్నారు. ఈ సందర్భంగా, చాలా బాగా మాట్లాడారంటూ, రాహుల్ కు మోదీ కితాబిచ్చారు. అనంతరం అక్కడి నుంచి వచ్చి తన సీట్లో కూర్చున్న రాహుల్... కాంగ్రెస్ నేతలవైపు చూస్తూ, కన్నుగీటారు. కెమెరా కంటికి చిక్కిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rahul Gandhi
eye wink
Lok Sabha
no confidence motion

More Telugu News