mulayam singh: యువతకు ఉపాధి కల్పనలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది: ఎస్పీ నేత ములాయం

  • రైతు సమస్యలను పరిష్కరించట్లేదు
  • రైతులు, వ్యాపారులు, యువతకు ఇబ్బంది తప్పట్లేదు
  • కనీస మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయాలి
దేశంలో యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించట్లేదని, ఈ ప్రభుత్వ చర్యలతో రైతులు, వ్యాపారులు, యువత ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. యూపీలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఇవి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలని మండిపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు వేసిన రైతులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయాలని ములాయం డిమాండ్ చేశారు.
mulayam singh
lok sabha

More Telugu News