Rahul Gandhi: లోక్ సభలో మోదీని కౌగిలించుకున్న రాహుల్ గాంధీ.. అవాక్కయిన ప్రధాని!
- మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకున్న రాహుల్
- భుజం తట్టి, అభినందించిన మోదీ
- లోక్ సభలో ఊహించని ఘటన
అవిశ్వాసంపై ప్రసంగం సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, మీ మనసుల్లో తనపై ద్వేషం ఉంటుందని అన్నారు. తనను పప్పు అని పిలవాలని, ఇంకా ఎన్నో మాటలు అనాలని మీకు ఉంటుందని... కానీ, తన మనసులో మాత్రం ఏమాత్రం ద్వేషం ఉండదని చెప్పారు.
ఆ తర్వాత వెంటనే తన స్థానం నుంచి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, ఆయనను కౌగిలించుకున్నారు. రాహుల్ చర్యతో ఒక క్షణం మోదీ నిశ్చేష్టుడయ్యారు. వెంటనే రాహుల్ చేతిని అందుకుని, భుజం తడుతూ ఆయనను అభినందించారు. ఈ ఘటనతో లోక్ సభలో నవ్వులు విరబూశాయి. సభ్యులంతా బల్లలు చరుస్తూ, ఆనందం వ్యక్తం చేశారు.