Karnataka: శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామీజీ శివైక్యం!

  • ఫుడ్ పాయిజనింగ్‌తో ఆసుపత్రిలో చేరిక
  • కడుపులో రక్తస్రావం కావడంతో మృతి
  • అవసరమైతే దర్యాప్తు జరిపిస్తామన్న కుమారస్వామి

కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో చేరిన శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామీజీ శివైక్యం చెందారు. ఉడిపి అష్టమఠాలలో శిరూరు కూడా ఒకటి. ఫుట్ పాయిజనింగ్‌తో బుధవారం మంగళూరులోని కేఎంసీ ఆసుపత్రిలో స్వామీజీ చేరారు. కడుపులో తీవ్ర రక్తస్రావం కావడంతో గురువారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. స్వామీజీ శరీరం విషపూరితమైనట్టు ఆసుపత్రి ముఖ్య వైద్యుడు అవినాశ్‌శెట్టి తెలిపారు.

స్వామీజీ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనది అసహజ మరణమని ఉడుపి పెజావర మాజీ జూనియర్‌ మఠాధిపతి విశ్వవిజయ స్వామీజీ ఆరోపించారు. స్వామీజీ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అవసరమైతే విచారణకు ఆదేశిస్తామని సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. స్వామీజీ మరణం పట్ల మాజీ ప్రధాని దేవెగౌడ, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తదితరులు సంతాపం తెలిపారు.

More Telugu News