ACB: చెన్నయ్ లో కాంట్రాక్టర్ ఇంట్లో రూ.215 కోట్ల నగదు.. నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు!

  • సెయ్యాదురై కార్యాలయాలపై మూడో రోజూ తనిఖీలు
  • మూటల కొద్దీ నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం
  • ఇంటి గోడలోని రహస్య గదిలో విలువైన పత్రాలు

తమిళనాడు కాంట్రాక్టర్ సెయ్యాదురై ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు విస్తుపోతున్నారు. నగదు కట్టలు, బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండడం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెయ్యాదురై, ఆయన కుమారుల నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం మూడో రోజూ కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఈ మూడు రోజుల్లో మొత్తం రూ.215 కోట్ల నగదు, బంగారం, వజ్రాలు, వీవీఐపీ పేర్లతో ఉన్న డైరీలను స్వాధీనం చేసుకున్నారు.

అన్నాదురై నలుగురు కుమార్లకు రాష్ట్రవ్యాప్తంగా 50 ఇళ్లు ఉండడం విశేషం. వీటిన్నింటిపైనా ఏకకాలంలో దాడి చేసిన అధికారులకు సెయ్యాదురై ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థమైంది. కోట్ల రూపాయల నగదు, స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. రామనాథపురంలోని కుముదిలో ఉన్న ఓ ఇంటి గోడలో రహస్య గదిని అధికారులు గుర్తించి బద్దలుగొట్టారు. అందులో విలువైన పత్రాలు దొరికాయి. 15 బ్యాంకు లాకర్లను సీజ్ చేసిన అధికారులు, సెయ్యాదురై కుమారుడు నాగరాజు సహాయకుడి ఇంటి నుంచి మూటల కొద్దీ నగదు, బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News