Sonia Gandhi: జస్ట్ వెయిట్.. జరిగేదేంటో చూస్తారుగా!: అవిశ్వాసంపై సోనియా గాంధీ

  • అవిశ్వాసంపై రేపే చర్చ
  • ప్రతిపక్షాల వద్ద తగినంత బలం లేదని బీజేపీ ఎద్దేవా
  • వేచి చూడాలన్న సోనియా

విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ దీనిని ఆమోదించడంతో శుక్రవారం చర్చకు రానుంది. 2003లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంపై సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఇప్పుడు మళ్లీ ఎన్‌డీయే ప్రభుత్వంపైనే అవిశ్వాస చర్చ జరగనుంది. అప్పుడు ముందుండి నడిపించిన సోనియా.. ఇప్పుడు వెనకుండి అవిశ్వాస తీర్మానాన్ని నడిపిస్తున్నారు.

అయితే, బీజేపీకి ఇప్పటికే తగినంతమంది సభ్యుల మద్దతు ఉంది. మిత్రపక్షాలను కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ కంటే వారి బలం ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంలో నెగ్గడానికి ప్రతిపక్షాల వద్ద సరైన బలం లేదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఇదే విషయాన్ని మీడియా  సోనియా దృష్టికి తీసుకెళ్లింది. ఆమె స్పందిస్తూ.. తమకు బలం లేదని ఎవరన్నారని, కొంత సమయం వేచి చూస్తే జరగబోయేది ఏమిటో తెలుస్తుందని పేర్కొన్నారు. 

More Telugu News