vishnu kumar raju: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం: విష్ణుకుమార్ రాజు

  • టీడీపీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం బీజేపీకి లేదు
  • ఏపీకి చేసినవన్నీ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వివరిస్తాం
  • చర్చ సందర్భంగా ఏపీకి ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది
కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసిందో దేశ ప్రజలకు వివరించడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. చర్చ సందర్భంగా ఏపీకి కొన్ని ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉందని... విశాఖ రైల్వే జోన్ ను కూడా ప్రకటిస్తారని తాను భావిస్తున్నానని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, టీడీపీల గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని విష్ణు తెలిపారు. టీడీపీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చడం కూడా తప్పని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు కేవలం ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చారని... ఏపీకి అంతకు మించి ఇస్తున్నామని తెలిపారు. 
vishnu kumar raju
no confidence motion
bjp
Telugudesam
YSRCP

More Telugu News