jet airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 25 నుంచి 30 శాతం వరకు రాయితీ

  • ఈ నెల 17 నుంచి 23 వరకు అందుబాటులో ఆఫర్
  • దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో డిస్కౌంట్లు
  • వన్ వే సర్వీసులకు మాత్రం వర్తించని ఆఫర్
విమాన ప్రయాణికులకు జెట్ ఎయిర్ వేస్ మంచి ఆఫర్ ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో ప్రయాణించే వారికి 30 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్టు తమ వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపింది. దేశీయ ప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ లో 25 శాతం డిస్కౌంట్ వర్తించనున్నట్టు పేర్కొంది.

ఇక అంతర్జాతీయ సర్వీసుల్లో ఎకానమీ, ప్రీమియం క్లాసులలో ఛార్జీల ఆధారంగా ఈ డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. మాంఛెస్టర్ వెళ్లే ప్రయాణికులకు మాత్రం నవంబర్ 5 నుంచి ఈ ఆఫర్ వర్తించనుంది. తమ సంస్థకు యూరప్ లో భాగస్వాములైన ఎయిర్ ఫ్రాన్స్, కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. కాగా, టొరెంటోకు వెళ్లే సర్వీసులకు, కోల్ కతా-ఢాకా వెళ్లే వన్ వే సర్వీసులకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదని ఆ వెబ్ సైట్ లో స్పష్టం చేసింది.
jet airways
30% discount

More Telugu News