Kesineni Nani: వైసీపీ ఎంపీల రాజీనామాల వెనకున్న అసలు కారణం ఇదే: కేశినేని నాని

  • అవిశ్వాసంపై చర్చ జరుగుతుందనే రాజీనామాలు చేశారు
  • బీజేపీతో కుమ్మక్కయిన వైసీపీ.. ఆ పార్టీని విమర్శించలేదు
  • చర్చ సందర్భంగా 14 అంశాలపై మాట్లాడతాం
వైసీపీ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే... ముందస్తుగా వారు రాజీనామాలు చేశారని ఆరోపించారు. చర్చ సందర్భంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై మాట్లాడాల్సి ఉంటుందని, బీజేపీని నిలదీయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఆ పని చేయలేదని... అందుకే వారు ముందుగానే రాజీనామాలు చేశారని చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా 14 అంశాలపై మాట్లాడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు.
Kesineni Nani
YSRCP
mp
resignations
no confidence motion

More Telugu News