'శ్రీనివాస కళ్యాణం' నుంచి టీజర్ వచ్చేస్తోంది
- దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కళ్యాణం'
- నితిన్ సరసన రాశి ఖన్నా
- ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా ఆడియో వేడుక కోసం కూడా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆడియో వేడుక ఎప్పుడనే విషయాన్ని టీజర్ ద్వారానే తెలియజేస్తారట. వివాహ బంధంలోని గొప్పతనాన్ని చాటిచెప్పే కథాకథనాలతో ఈ సినిమా కొనసాగనుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'శతమానం భవతి' తరువాత దిల్ రాజు నుంచి వస్తోన్న కుటుంబ కథాచిత్రం ఇది. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.