అంపైర్ నుంచి బాల్ తీసుకున్న ధోనీ.. కంగారు పడుతున్న అభిమానులు!

18-07-2018 Wed 12:02
  • నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ నుంచి బాల్ తీసుకున్న ధోనీ
  • రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడేమో అంటూ అభిమానుల కలవరం
  • ఎలాంటి ప్రకటన చేయవద్దని విన్నపం
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన ఒక ఘటన క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. మ్యాచ్ ను భారత్ కోల్పోయిన అనంతరం... అంపైర్ల వద్దకు వచ్చిని ధోనీ, వారి వద్ద నుంచి బాల్ ను తీసుకుని, పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని స్పందనలు ఇవి.

  • ఇంగ్లండ్ లో ధోనీకి ఇదే చివరి మ్యాచా?
  • బిగ్ క్వశ్చన్. అంపైర్ల వద్ద నుంచి ధోనీ బాల్ ఎందుకు తీసుకున్నాడు?
  • త్వరలోనే ధోనీ రిటైర్ అవుతున్నాడు. నేను చెబుతున్నది పక్కా.
  • నాకు చాలా భయంగా ఉంది. ధోనీ రిటైర్ కావడానికి ఇది సరైన సమయం కాదు. ధోనీ ప్లీజ్... రిటైర్ కావద్దు. ఎలాంటి ప్రకటన చేయవద్దు.
  • త్వరలోనే రిటైర్ మెంట్ ప్రకటన ఉండవచ్చు. ఆసియా కప్ చివరది కావచ్చు.