hyderabad: కళ్లలో కారం కొట్టి, బండరాయితో మోది హత్య.. హైదరాబాదులో దారుణం

  • అత్తాపూర్ పిల్లర్ నంబర్ 143 వద్ద హత్య
  • నగదు లావాదేవీలే కారణం అయి ఉండవచ్చన్న పోలీసులు
  • హంతకులను త్వరలోనే పట్టుకుంటామన్న సీఐ  
హైదరాబాదు రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అత్తాపూర్ లో పిల్లర్ నంబర్ 143 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని బహదూర్ పురాకి చెందిన ఖలీద్ గా పోలీసులు గుర్తించారు. కళ్లలో కారం కొట్టి, వెంబడించి, బండరాయితో మోది హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు కారణం నగదు లావాదేవీలే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకుంటామని రాజేంద్రనగర్ సీఐ సురేష్ తెలిపారు.  
hyderabad
murder

More Telugu News